Article-2


ఈరోజు పొద్దున్నే ఇంటి ఖర్చుల కోసం మా ఆవిడ కొంత డబ్బు ఇవ్వమని అడిగింది. నేను వెంటనే ఈ విధంగా చేయమని చెప్పాను... ఈ నెలలో ఇంటి కోసం పప్పులు,ఉప్పులు ఏమేమి కొన్నావో నాకు చూపించు, బిల్లులు తీసుకురా, ఫిజికల్ వెరిఫికేషన్ చేయించు...... ఇంట్లో ఉన్న అందరికీ రోజూ టిఫిన్ ఎంత మొత్తంలో చేస్తున్నావు,చట్నీ ఎంత చేస్తున్నావు,ఎన్ని రోటీలు చేస్తున్నావు,ఎన్ని కూరలు ఎంతెంత వండుతున్నావు, ఎంత మంది తింటున్నారు ఇవన్నీ సపరేటుగా రాసి పెట్టు..... చుట్టాలు, స్నేహితులు వచ్చినపుడు ఏమి టిఫిన్ చేస్తున్నావు, ఎన్ని బిస్కెట్ లు పెడుతున్నావు, ఎంతమందికి చాయ్ ఇస్తున్నావు ఇవన్నీ కూడా విడిగా రాసి పెట్టు. ఇంట్లో ఏమేమి తినుబండారాలు వృధా (waste, EXPIRY ) అవుతున్నాయి, ఎంత చాయ్ పారబోస్తున్నావు, ఎంత అన్నం , ఎన్ని కూరలు పడవేస్తున్నావు, అడుక్కునే వాడికి ఏమేమి ఎంతెంత పెడుతున్నావు, ఆవులకు , కుక్కలకు ఎంతెంత పెడుతున్నావు ఇవన్నీ సేపరేటు పేజిలో విడివిడిగా వ్రాయి.... కూరగాయల వాడి దగ్గర ఫ్రీ కరివేపాకు, ధనియాల ఆకు ఎంత తీసుకున్నావో అది లెక్క కట్టి మన ఇన్ కమ్ లో కలుపు..... పార్టీలలో గెలిచిన తంబోలా ఆటలో ప్రైజ్ మనీ కూడా మన ఇన్ కమ్ లో కలుపు..... నెలాఖరు లో ఇంట్లో పప్పులు ఉప్పులు ఏమేమి ఎంతెంత మిగిలినవో గ్రాముల, ఔన్స్ ల లెక్క ప్రకారం విడివిడి గా రాసిపెట్టు..... లెక్కల్లో ఏమాత్రం తేడా వచ్చినా తాట, తాట తీస్తా అన్నాను. నేను ఇలా మాట్లాడుతుంటే మా ఆవిడకు విపరీతమైన కోపం వచ్చి...పూనకం వచ్చిన్నట్లు ఊగిపోతోంది. ఏమిటి పిచ్చి పిచ్చి గా మాట్లాడుతున్నారు, సంసారం ఇలాగేనా నడిపేది, ఇన్ని లెక్కలు, డొక్కలు ఎలా రాయాలి, ఎవడు కూర్చుని రాస్తాడు. నాకేమయినా పిచ్చి కుక్క కరిచిందనుకుంటున్నవా, నిన్నేమయినా కరచిందా, ఇలా చేయమని నీకు ఏ వెదవ చెప్పింది, ముందు వాడిని చెప్పుతో కొట్టాలి, పొద్దున్నే మందు కొట్టి వచ్చావా అని నాకు లెఫ్ట్ & రైట్ ఇచ్చి , నేను బట్టలు సద్దుకుని మా పుట్టింటికి వెళతాను , నీ చావు నువ్వు చావు, అని మా ఆవిడ ఇల్లు వదిలి వెళ్లడానికి తయారయింది. ఇదింకా తారాస్థాయికి పోయేట్లుందని, అపుడు నేను నవ్వుతూ చెప్పాను.... నిన్న రాత్రి GST గురించి అడిగావుగా, GST అంటే ఏమిటి, అదెలాఉంటుంది అని , ఇదిగో ఇలాగే ఉంటుంది, అన్నాను నేను...

Comments

Popular posts from this blog

BANJARA-SEVALAL MAHARAJ

World Environment Day 5 June

Article-1